Google కీబోర్డ్‌లో మీరు మెచ్చే అన్ని అంశాలను Gboard కలిగి ఉంది—వేగం, విశ్వసనీయత, పదం పూర్తయ్యేదాకా వేలిని తీసివేయకుండా టైప్ చేయడం, వాయిస్ టైపింగ్, చేతివ్రాత, మరిన్ని అంశాలు ఉన్నాయి
పదం పూర్తయ్యేదాకా వేలిని తీసివేయకుండా టైప్ చేయడం — మీ వేలిని అక్షరం నుండి అక్షరానికి స్లైడ్ చేయడం ద్వారా వేగంగా టైప్ చేయడం
వాయిస్ టైపింగ్ — ప్రయాణంలో సులభంగా టెక్స్ట్‌ను డిక్టేట్ చేయడం
చేతివ్రాత* — కర్సివ్, ప్రింటెడ్ అక్షరాలలో రాయడం
ఎమోజి సెర్చ్* — ఎమోజిని వేగంగా కనుగొనడం
GIFలు* — ఖచ్చితమైన ప్రతిస్పందన కోసం GIFలను సెర్చ్ చేసి, షేర్ చేయడం.
బహుభాషా టైపింగ్ — భాషల మధ్య మాన్యువల్‌గా మారాల్సిన అవసరం ఇకపై ఉండదు. మీరు ఎనేబుల్ చేసిన భాషలలో దేనిలో అయినా Gboard ఆటోమేటిక్‌గా సరి చేసి, సూచనలు అందించగలదు.
Google Translate — కీబోర్డ్‌లో మీరు టైప్ చేసే దాని ప్రకారం అనువాదం చేస్తుంది
*Android Go పరికరాలలో సపోర్ట్ చేయదు
వీటితో సహా, వందల కొద్దీ భాషలను కలిగి ఉంటుంది:
ఆఫ్రికాన్స్, అమ్హారిక్, అరబిక్, అస్సామీ, అజర్‌బైజానీ, బవేరియన్, బెంగాలీ, భోజ్‌పురి, బర్మీస్, సెబువానో, ఛత్తీస్‌గఢీ, చైనీస్ (మాండరిన్, కాంటోనీస్, ఇతర భాషలు), చిట్టగోనియన్, చెక్, డెక్కన్, డచ్, ఇంగ్లీష్, ఫిలిప్పినో, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, గుజరాతీ, హౌసా, హిందీ, ఇగ్బో, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, జవనీస్, కన్నడ, ఖ్మేర్, కొరియన్, కుర్దిష్, మగహి, మైథిలి, మలయ్, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఉత్తర సోతో, ఒడియా, పాష్టో, పార్సీ, పోలిష్, పోర్చుగీస్, పంజాబీ, రొమేనియన్, రష్యన్, సరైకి, సింధి, సింహళ, సోమాలి, దక్షిణ సోతో, స్పానిష్, సుండనీస్, స్వాహిలి, తమిళం, తెలుగు, థాయ్, స్వానా, టర్కిష్, ఉక్రేనియన్, ఉర్దూ, ఉజ్బెక్, వియత్నమీస్, షోసా, యోరుబా, జులు, ఇంకా మరిన్ని భాషలు! సపోర్ట్ చేసే భాషల పూర్తి లిస్ట్ కోసం Visit https://goo.gl/fMQ85Uను సందర్శించండి
నిపుణుల చిట్కాలు:
• సంజ్ఞ కర్సర్ కంట్రోల్: కర్సర్‌ను కదపడానికి స్పేస్ బార్ మీదుగా మీ వేలిని స్లైడ్ చేయండి
• సంజ్ఞ తొలగింపు: పలు పదాలను త్వరగా తొలగించడానికి 'డిలీట్ కీ' నుండి ఎడమ వైపునకు స్లైడ్ చేయండి
• ఎల్లప్పుడూ సంఖ్య వరుసను అందుబాటులో ఉండేలా చేయండి (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంఖ్య వరుస ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి)
• సంకేతాల సూచనలు: ఎక్కువసేపు నొక్కి, ఉంచడం ద్వారా సంకేతాలను యాక్సెస్ చేయడానికి మీ 'కీ'లపై త్వరిత సూచనలను చూపించండి (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంకేతాల కోసం ఎక్కువసేపు నొక్కి ఉంచండి ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి)
• వన్-హ్యాండెడ్ మోడ్: పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్‌లలో, కీబోర్డ్‌ను స్క్రీన్ ఎడమ వైపునకు లేదా కుడి వైపునకు పిన్ చేయండి
• రూపాలు: కీ అంచులతో లేదా అంచులు లేకుండా మీ స్వంత రూపాన్ని ఎంచుకోండి
అప్‌డేట్ అయినది
8 జన, 2025