గుర్తింపు పొందిన ఒక ఇంగ్లీష్ పరీక్షతో మీ ఇంగ్లీష్ స్థాయిని అన్వేషించండిఇంగ్లీష్ నేర్చుకోవాలని చూస్తున్నారా?
- అప్పటికప్పుడు లభ్యమయ్యే ఫలితాలతో ఒక ఉచిత ఇంగ్లీష్ పరీక్ష తీసుకోండి
- మీ వ్యాకరణం, పదప్రయోగ మరియు శ్రవణ నైపుణ్యాలను పరీక్షించుకోండి మరియు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోండి
- ఐ.ఇ.ఎల్.టి.ఎస్ (IELTS), టి.ఓ.ఇ.ఎఫ్.ఎల్ (TOEFL) మరియు టి.ఓ.ఇ.ఐ.సి (TOEIC) వంటి ఇంగ్లీష్ పరీక్షలకు తయారవండి
- ఒక ఉద్యోగదాతకు మీ ఇంగ్లీష్ స్థాయిని నిరూపించుకునేందుకై ఒక ధృవీకరణ పత్రాన్ని కొనుగోలు చేసే ఐచ్ఛికాన్ని చేరి ఉంటుంది
- మీరు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు సహాయపడే కోర్స్ సిఫారసులను పొందండి
ఇంగ్లీష్ స్కోర్ (EnglishScore) ఎందుకు?★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) అనేది గుర్తింపు పొందినట్టిది. మా ధృవపత్రము ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగదాతలచే స్వీకరించబడుతోంది, కొన్నింటిని ఇక్కడ చూడండి: https://www.englishscore.com/employer-directory/
★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) అనేది విశ్వసనీయమైనది. ప్రతి సంవత్సరమూ, రెండు మిలియన్లకు పైగా వ్యక్తులు బ్రిటిష్ కౌన్సిల్ తో అంతర్జాతీయ ఇంగ్లీష్ పరీక్షలు మరియు విద్యార్హతలను తీసుకుంటున్నారు.
★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) త్వరితమైనది మరియు కచ్చితమైనది. ఇంగ్లీష్ భాషా నిపుణులచే రూపొందించబడిన ఒక పరీక్షతో 30 నిముషాల స్వల్ప వ్యవధిలో మీ ఇంగ్లీష్ స్థాయిని తెలుసుకోండి.
★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) ఉచితం. పరీక్ష తీసుకోండి మరియు ఫలితాలు పొందండి - నైపుణ్యముచే విడదీయబడుతూ - ఎటువంటి ఖర్చు లేకుండానే.
ఇంగ్లీష్ పరీక్ష గురించిEnglishScore (ఇంగ్లీష్ స్కోర్) మీకు 0 నుండి 599 మధ్యన ఒక స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ సి.ఇ.ఎఫ్.ఆర్ (CEFR) సూచీపై A1-C1 కు సర్దుబాటు అవుతుంది. ఐ.ఇ.ఎల్.టి.ఎస్ (IELTS), టి.ఓ.ఇ.ఐ.సి (TOEIC) మరియు టి.ఓ.ఇ.ఎఫ్.ఎల్ (TOEFL) వంటి పరీక్షలతో ఫలితాలను పోల్చుకోవడానికి మీరు సి.ఇ.ఎఫ్.ఆర్ (CEFR) స్కోరును ఉపయోగించుకోవచ్చు.
మీ లక్ష్యాలు మరియు పరీక్షలో పనితీరు ఆధారంగా కోర్సు సిఫారసులతో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించవచ్చు.
మోసంపై రక్షణ కల్పించడానికై, EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) భద్రతను చాలా తీవ్రమైనదిగా భావిస్తుంది. ప్రతి పరీక్ష (టెస్ట్) కూడా మీరు మొదలుపెట్టే ప్రతిసమయానికీ మా విస్తృతమైన వస్తునిధి నుండి తాజాగా నిర్మితమై ఉంటుంది కాబట్టి అది విశిష్టమైనది. పరీక్ష తీసుకునే వ్యక్తి ఒంటరిగానే పనిచేస్తున్నట్లుగా చూసుకోవడానికి గాను మేము కెమెరా ఉపయోగిస్తాము, మరియు స్కోరు ఇంగ్లీష్ సామర్థ్యానికి సహేతుకమైన ప్రాతినిధ్యమని నిర్ధారించుకునేందుకై పునరావృత పరీక్షలను పరిమితం చేస్తాము.
పెద్ద స్థాయిలో ఇంగ్లీష్ పరీక్షలను నిర్వహించాలని చూస్తున్న వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల కొరకు EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) అందుబాటులో ఉంది. ఇక్కడ మరింతగా తెలుసుకోండి: https://www.englishscore.com/for-employers/
ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే to
[email protected] కు పంపించండి
గోప్యతా విధానము: https://www.englishscore.com/privacy-policy/
సేవల యొక్క షరతులు: https://www.englishscore.com/terms-of-use/